BREAKING
చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

Select Suryaa Now
లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

అక్టోబర్ 2 చరిత్రలో నిలిచిపోయే రోజు – రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం

మదనపల్లె: రాయలసీమను రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదాతకు నేరుగా ప్రయోజనం చేకూరేలా ఆధునిక సాంకేతికత, పరిశోధనలు, మార్కెటింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

అక్టోబర్ 2, 2026 రాయలసీమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం పేర్కొన్నారు. రాయలసీమ కరువు సీమ కాదని, ఇకపై సిరుల సీమగా మారుతుందని అన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామని గతంలో చెప్పామని, ఇప్పుడు ఆ దిశగా ఫలితాలు చూపిస్తున్నామని తెలిపారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు నాంది పలుకుతుందని, IIM ద్వారా మేనేజ్‌మెంట్ లీడర్లు, IIT ద్వారా సాంకేతిక నిపుణులు తయారవుతారని సీఎం వివరించారు.

అనంత్ అంబానీ చేపట్టిన ప్రాజెక్టును విజయవంతం చేసే వరకు వదిలిపెట్టరని, ఆయన పారిశ్రామికవేత్త మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికుడని చంద్రబాబు అన్నారు. ఇవాళ్టి నుంచి అనంత్ అంబానీని తెలుగు బిడ్డగా, మనందరి ముద్దుబిడ్డగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన నిధుల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహకరిస్తున్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థిక సహాయం అందించి నిలబెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారిపై భక్తితో అనంత్ అంబానీ ఎలక్ట్రిక్ బస్సులను అందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో వ్యవసాయం, ఉద్యానవనం, పరిశ్రమలు, విద్యా రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రాంతాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామని అన్నారు.