BREAKING
జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ

Select Suryaa Now
పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం  తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ

అనంతపురం బ్యూరో : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుత్తి మండలం తురకపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వెంకట శివుడు యాదవ్‌లకు స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

గ్రామస్థులు మాట్లాడుతూ గుత్తి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో తమ గ్రామానికి సీసీ రోడ్లు కావాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు. తమ విజ్ఞప్తిపై స్పందించి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, యువనేత గుమ్మనూరు ఈశ్వర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుని ఎమ్మెల్యేకు బహుమతిగా అందిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, తురకపల్లి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గుత్తి మండల, పట్టణ కూటమి నాయకులు, అనుబంధ కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.