ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన
అనంతపురం బ్యూరో : ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో ఓట్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నాయకులు ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ గుంతకల్లు పట్టణ ప్రధాన కార్యదర్శి బి. రామదాసు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కును పరిరక్షించేందుకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.