BREAKING
పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఒకే రోజులో 10 సాధారణ ప్రసవాలు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి రేణు దేశాయ్ కాశీ మజిలీ సినిమా నుంచి సోల్‌ఫుల్ పోయెట్రీ సాంగ్.. భావోద్వేగంగా యమునా కిశోర్ కవితా గీతం!

రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి"

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి"

రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి"

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్)రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మండలంలోని విద్యానగర్ కాలనీ, హనుమాన్ ఆలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  వేపలగడ్డకు చెందిన రొంకు సత్యనారాయణ (27) హైదరాబాద్‌లోని విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన గురువారం రాత్రి పని నిమిత్తం కొత్తగూడెం వచ్చి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్లుచుండగా
విద్యానగర్ కాలనీ హనుమాన్ ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనంతో డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడని వైద్యులు తెలిపారు. చేతికందిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పచెప్పినట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.
*పోలీస్ వారి సూచనలు*
హెల్మెంట్ ధరించి మీ వాహనాలపై ప్రయాణించండి సురక్షితంగా మీ గమ్య స్థలానికి చేరుకోండి, ఇంటిదగ్గర మీకోసం మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు, కావున దయచేసి కొన్ని నియమ నిబంధనలు పాటించండి, సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.