BREAKING
టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఒకే రోజులో 10 సాధారణ ప్రసవాలు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*

Select Suryaa Now
రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి*

 

విజయనగరం, అక్టోబర్ 2 మేజర్ న్యూస్:

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ఆహార దినుసులు, వంట సామగ్రి కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్, విశాఖపట్నం వారి సహకారంతో సత్యసాయి దివ్యమృతం ఆధ్వర్యంలో వంట సామగ్రి కిట్లను అందించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 1,500 బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల విలువైన వంట సామగ్రి కిట్లను నెలకు సరిపడా బియ్యంతో సహా పంపిణీ చేయనున్నారు.

ఈ సందర్భంగా వంట సామగ్రి కిట్లతో కూడిన వాహనాన్ని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, విపత్తు సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, సత్యసాయి దివ్యమృతం సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి అందిస్తున్న సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు అందించే సహకారం బాధితులకు ఎంతో భరోసానిస్తుందని అన్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు వంట సామగ్రి అందించడం ద్వారా వారి రోజువారీ జీవనం త్వరగా సాధారణ స్థితికి చేరేందుకు ఈ సహాయం దోహదపడుతుందని తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్, సత్యసాయి దివ్యమృతం ప్రతినిధులు, వాలంటీర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, లోక్ సత్తా ప్రతినిధి భీశెట్టి బాబ్జి, ఇన్ఫోసిస్ ప్రతినిధి కిషోర్ కుమార్, సత్యసాయి దివ్యమృతం వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.