మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్...
మహాత్మా గాంధీ ఆశయాలు పూర్తిగా సాధించేందుకు అందరూ వారి బాటలో నడవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న పూజ్య బాపూజీ విగ్రహానికి పూల మాలవేసిఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ శాంతియుత వాతావరణం లో దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని , స్వరాజ్యం రాకముందే కుల వివక్షతకు వ్యతిరేకంగా మతసామరస్య సాధనకు, అన్ని మతాలను గౌరవిస్తూ పోరాటం చేశారని చెప్పారు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బాపూజీ చెప్పారని, వారి ఆదర్శాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మూసి దగ్గరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరున మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిందని తెలిపారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ మహాత్మా గాంధీ బాటలో నడుస్తూ గ్రామపంచాయతీ నిధులను నేరుగా సర్పంచ్ ల ఖాతాలో జమ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గాంధీజీ ఆశయాలు పూర్తిగా సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహానీయుడు మహాత్మా గాంధీ అని అన్నారు. మోహన్ దాస్ కరం చంద్ గాంధీగా, తర్వాత మహాత్మా గాంధీగా ఆయన పేరుగాంచారని పేర్కొన్నారు .నల్గొండ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ అహింస ,సత్యం అనే ఆయుధాలతో పూజ్య బాపూజీ భారతదేశ స్వాతంత్రాన్ని సాధించారని, వారి అడుగుజాడల్లో అందరు నడవాలని అన్నారు.కార్పొరేటర్ కవిత,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ , దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి, స్థానిక తహసిల్దార్ పరశురాం ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిథులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.