BREAKING
మార్వెల్ సినిమాలపై హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ సంచలన వ్యాఖ్యలు.. అవి డబ్ల్యూడబ్ల్యూఈ లాంటివేనంటూ విమర్శలు! గుండ్లపోచంపల్లి డివిజన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గ్రంథాలయంలో గాంధీ జయంతి వేడుకలు రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గాంధీ జయంతి వేళ మద్యం నిషేధం తీర్మానం - బెల్ట్ షాపుపై గ్రామస్థుల దాడి, మద్యం పట్టివేత సమాజ హితం కోసం వైబ్రేంట్ అడ్వకేట్ అసోసియేషన్ రిపోర్టర్‌పై హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ మంచి మనసు.. ప్రత్యేకంగా స్పందించి నెట్టింట వైరల్! డబ్బా గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి ఎస్‌ఐఆర్‌ నిలిపివేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి చింతలమానేపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గాంధీ జయంతి సందర్భంగా సర్వం సిద్ధం చేసిన మున్సిపల్ సిబ్బంది డిపిఆర్ఓ తీరు మారకపోతే ఖాబార్ధార్..! - ఇటు కలెక్టర్, అటు కమీషనర్ లను సైతం తప్పుదోవ పట్టిస్తున్న వైనం. - జర్నలిస్ట్ హక్కులను కాలేరాస్తే ఊరుకునేది లేదు. - అధికారి తీరుతో మారుమూల, ఏజెన్సీ ప్రాంత జర్నలిస్ట్ లకు తీరని అన్యాయం. టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్ కజ్రా రే 2.0 పాట చేయడానికి నేను సిద్ధం.. ఐశ్వర్య రాయ్, నాన్నను ఒప్పించండి: అభిషేక్ బచ్చన్!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైటెన్షన్..

Select Suryaa Now
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హైటెన్షన్..

 

టేకాఫ్ సమయంలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం !

కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో ప్రయాణికుడి హల్‌చల్.. పోలీసులకు అప్పగింత

 శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అర్ధరాత్రి తీవ్ర కలకలం చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేయడంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి కడపకు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, ఇతర సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

విమానంలో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం సదరు ప్రయాణికుడిని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు గల కారణాలు, ప్రయాణికుడి ప్రవర్తన వెనుక ఉన్న ఉద్దేశాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

విమానంలో భద్రతకు సంబంధించిన ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

_పోతుల నర్సింహా, మేజర్ స్యూస్ : శంషాబాద్