BREAKING
గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్

గాంధీ జయంతి వేళ మద్యం నిషేధం తీర్మానం - బెల్ట్ షాపుపై గ్రామస్థుల దాడి, మద్యం పట్టివేత

Select Suryaa Now
గాంధీ జయంతి వేళ మద్యం నిషేధం తీర్మానం - బెల్ట్ షాపుపై గ్రామస్థుల దాడి, మద్యం పట్టివేత

సూర్య జైనూర్ :
జైనుర్,మండలం పట్నాపూర్ గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా ఓవైపు గ్రామంలో సంపూర్ణ మద్యం నిషేధం విధించాలని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేయగా, మరోవైపు గ్రామంలోనే గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపు బట్టబయలైంది. నిషేధ తీర్మానం చేసిన కొద్ది గంటల్లోనే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపు యజమాని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కందారే లక్ష్మీ బాలాజీ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు, మహిళలు, యువత పాల్గొని గ్రామంలో శాంతిభద్రతలు, కుటుంబాల సంక్షేమం దృష్ట్యా మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించారు.
సభ ముగిసిన కొద్దిసేపటికే గ్రామంలోని అందుగూడ వద్ద ఉన్న ఓ ఇంట్లో యథేచ్ఛగా బెల్ట్ షాపు నడుపుతూ మద్యం అమ్ముతున్నట్లు గ్రామస్థులకు సమాచారం అందింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, మహిళలు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుడు. భీషే అమృత్, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలతో పట్టుబడ్డాడు.
గ్రామసభ తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ మద్యం విక్రయిస్తున్న సదరు వ్యక్తిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని, నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నడిపినా, అక్రమంగా మద్యం విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సర్పంచ్, పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందారే, లక్ష్మీ బాలాజీ, ఉప సర్పంచ్ పెందూర్ లచ్చు, నగర్గోజే హనుమంతరావు, గోపాబాయి ,గ్రామ పటేల్ పూసం హనుమంతరావు, పెసా యాక్ట్ మొబిలైజర్,పూసం భీంరావ్, గ్రామ పోలీస్ విక్రమ్, తదితరులు పాల్గొన్నారు