BREAKING
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం

చింతలమానేపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
చింతలమానేపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

సూర్య, చింతలమానేపల్లి
మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి స్థానిక సర్పంచ్ మేకల పోశక్క, ఉప సర్పంచ్ టొంబ్రే శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, వార్డు సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, ధర్మం మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టి, ఆయన కలలుగన్న సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
గ్రామ సభలో అభివృద్ధి పనులపై చర్చ
గాంధీ జయంతి సందర్భంగా చింతలమానేపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ అధ్యక్షతన, ఎంపీడీఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు, వీబీజీ రామ్‌జీ (వి బి జి-ఆర్ ఏ ఎం-జి) పనులు తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వీవీఏలు, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.