BREAKING
చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు! 12 నుంచిశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు -భక్తులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలి : టిటిడి జేఈఓ డా.ఎ.శరత్ అభివృద్ధి ప్రణాళికపై తాడిచర్లలో గ్రామసభ గాంధీ మార్గంలో నడవాలి నర్సరీ రైతులకు తక్కువ ధరకే ఎర్రమట్టి :సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈనెల 29న థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు' రీరిలీజ్.. నవ్వుల రచ్చ చేయడానికి రెడీ అయిన క్లాసిక్ కామెడీ మూవీ! వెంకటాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు సమంతకు బాంబే హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అనుమతి లేకుండా ఫొటోలు, గొంతు వాడితే ఇక అంతే! జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు.. టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి ఎస్‌ఐఆర్‌ నిలిపివేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి

Select Suryaa Now
ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి  ఎస్‌ఐఆర్‌ నిలిపివేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి

అనంతపురం బ్యూరో : ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ లక్ష్యంగా అనంతపురం నగరంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించిన ఓట్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు ఈ ఆందోళన చేపట్టాయి.

సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, తొలగించిన ఓట్లను పునఃపరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని కోరారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందుబాటులో ఉండేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.