డిపిఆర్ఓ తీరు మారకపోతే ఖాబార్ధార్..! - ఇటు కలెక్టర్, అటు కమీషనర్ లను సైతం తప్పుదోవ పట్టిస్తున్న వైనం. - జర్నలిస్ట్ హక్కులను కాలేరాస్తే ఊరుకునేది లేదు. - అధికారి తీరుతో మారుమూల, ఏజెన్సీ ప్రాంత జర్నలిస్ట్ లకు తీరని అన్యాయం. టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్
నాగర్ కర్నూల్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి తీరు, వ్యవహారం వల్ల మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న అర్హత గల జర్నలిస్టులు తీరని అన్యాయానికి గురవుతున్నారని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటు జిల్లా ఉన్నతాధికారులను అటు రాష్ట్రస్థాయి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని టీయూడబ్ల్యూజేఐజేయు రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ విజయ్ కుమార్ సురేష్ కుమార్లు మండిపడ్డారు. శుక్రవారం ఐజేయు జర్నలిస్టు సంఘం పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నుండి అంబేద్కర్ కూడలి వరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం గాంధీ పార్క్ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో జిల్లాలోని జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న అర్హతగల జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు రాకుండా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ఓ కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. నిబంధనల మేరకు అర్హతలు ఉన్న జర్నలిస్టులకు సైతం ఉద్దేశపూర్వకంగానే ద్రోహం చేయాలన్న లక్ష్యంతో ఇటు జిల్లా ఉన్నతాధికారులకు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా జర్నలిస్టులు తీరని అన్యాయానికి గురవుతున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల స్వేచ్ఛ హక్కులను కాలరాసే అధికారం ఏ ఒక్కరికి లేదన్న విషయాన్ని గుర్తుతెరగాలని సూచించారు. ఇప్పటికైనా డిపిఆర్ఓ తీరు మార్చుకోకపోతే టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు సంఘం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షులు సందు యాదగిరి, టౌన్ అధ్యక్షులు బొడ్డుపల్లి మల్లేష్, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు రాజు గౌడ్, కల్వకుర్తి అధ్యక్షులు కాస్తూరి శ్రీనివాసులు, అచ్చంపేట సాయిబాబా అన్ని నియోజకవర్గ, జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలుకాల కార్యవర్గ సభ్యులు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పి .విజయ్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సూర్య న్యూస్