రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
నంద్యాల అర్బన్:నంద్యాల రెండవ పట్టణ
సీఐగా సుధాకర్ రెడ్డి శుక్రవారం బాధ్యతల స్వీకరించారు. గతంలో నంద్యాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయన తాజా బదిలీల్లో నంద్యాల రెండవ పట్టణ సీఐగా నియమితులయ్యారు.
సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు .శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలపై సమాచారం అందించాలని కోరారు. సమాచారమిచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
సీఐగా బాధ్యతలు స్వీకరించిన జి.సుధాకర్ రెడ్డికి పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది,ప్రముఖులు కలిశారు.