???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు. ఏలూరు పవర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు.
_*ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :*_
బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి జీవోలు జారీ చేసిందని, దీనిపై వైసీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చంటి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ, బీసీలకు న్యాయం జరిగేలా అవసరమైన న్యాయపరమైన చర్యలు చేపడతామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించడమే టీడీపీ లక్ష్యమన్నారు.