BREAKING
రేణు దేశాయ్ కాశీ మజిలీ సినిమా నుంచి సోల్‌ఫుల్ పోయెట్రీ సాంగ్.. భావోద్వేగంగా యమునా కిశోర్ కవితా గీతం! నాలుగేళ్ల చిన్నారితో అసభ్య ప్రవర్తన నాని సినిమా సరికొత్త రికార్డు.. వంద కోట్ల క్లబ్‌లో ది ప్యారడైజ్, పాపరాజీలతో కేక్ కట్ చేసిన సోనాలి కులకర్ణి! ఈస్ట్ ఆఫ్ ఈడెన్ వెబ్ సిరీస్ రివ్యూ.. జోయ్ కజాన్ కొత్త కోణంలో క్లాసిక్ నవల! కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు ప్రధాని మోదీ వీడియో కాల్ ..వందలాది ప్రాణాలు కాపాడిన ధైర్యానికి ప్రశంసలు.. దృశ్యం 3 ట్విట్టర్ రివ్యూస్.. అజయ్ దేవగన్ మూవీకి ప్రేక్షకుల నుంచి ఊహించని ప్రశంసలు! పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో యాదాల వెంకట సాయి కిరణ్ మార్వెల్ సినిమాలపై హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ సంచలన వ్యాఖ్యలు.. అవి డబ్ల్యూడబ్ల్యూఈ లాంటివేనంటూ విమర్శలు! గుండ్లపోచంపల్లి డివిజన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గ్రంథాలయంలో గాంధీ జయంతి వేడుకలు రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గాంధీ జయంతి వేళ మద్యం నిషేధం తీర్మానం - బెల్ట్ షాపుపై గ్రామస్థుల దాడి, మద్యం పట్టివేత సమాజ హితం కోసం వైబ్రేంట్ అడ్వకేట్ అసోసియేషన్ రిపోర్టర్‌పై హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ మంచి మనసు.. ప్రత్యేకంగా స్పందించి నెట్టింట వైరల్! డబ్బా గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

*జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి*

Select Suryaa Now
*జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి*

మధిర: సూర్య మేజర్ న్యూస్.

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నాయకులు డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మధిరలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మధిర ఎస్సీ కాలనీలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్, ఆరోగ్య భద్రత, ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడుతామని తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి పాగి బాలస్వామి, జిల్లా కమిటీ సభ్యులు శ్రీ రామోజీ యోగేష్, పార్శపు అరుణ్ సీనియర్ జర్నలిస్టులు రావిరాల శశి కుమార్ సుంకర సీతారాం, నాళ్ల శ్రీనివాసరావు దుబాసి రాజేష్ , వేములకొండ రాము, వేముల నవీన్, రావూరి కృష్ణ ప్రసాద్, పల్లపోతు ప్రసాద్ రావు, తలారి రమేష్, మిరియాల నరేష్, లిక్కిరవి, పబ్బతి జగదీష్ కోనా నరసింహారావు, చారు గుండ్ల లక్ష్మీనరసింహారావు, కోటా వెంకట్, వేల్పుల రామారావు, ఇరుగు పుల్లారావు మంద అశోక్, తాళ్లూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.