BREAKING
అన్యాయానికి గురవుతున్న కార్మికుల అంశాన్ని హై లెవెల్ మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తా.. బిజెపి నేత మిడతల రమేష్ కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ పథకాలకు 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. సల్మాన్ ఖాన్ ప్రస్తావనపై అలిగిన అర్బాజ్ ఖాన్.. ముంబై ఈవెంట్‌లో అసహనం హాలీవుడ్ ప్రీమియర్‌లో టమ్ క్రూయిజ్‌ను కలిసిన అవ్నీత్ కౌర్.. డిగర్ సినిమాపై ఆసక్తికర చర్చ కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం టీమిండియా ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అడ్డుకుంటున్నది వైసీపీనే ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శ కురుగుంట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం రెేపు గన్నవరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అమన్ సెహ్రావత్ అక్టోబర్ 9న తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల.. హోంబలే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ ఎంట్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అశోక్ ఎమ్ ఎస్ గ్లోబల్ ట్రేడర్స్ సంస్థను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో జోరు

హైదరాబాద్‌ను 'మోస్ట్ లివబుల్ సిటీ'గా తీర్చిదిద్దుతాం: రూ.52 వేల కోట్ల అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన

Select Suryaa Now
హైదరాబాద్‌ను 'మోస్ట్ లివబుల్ సిటీ'గా తీర్చిదిద్దుతాం: రూ.52 వేల కోట్ల అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన

హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర సమగ్ర ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేశామని, రూ.52,000 కోట్ల అంచనా వ్యయంతో విప్లవాత్మక అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా (Most Livable City) మార్చడమే తమ ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నగరవాసులకు సులభమైన ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చేందుకు రూ.38,000 కోట్లతో మెట్రో రైల్ ఫేజ్-2 పనులను చేపడుతున్నామని వివరించారు. అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30,000 కోట్ల అంచనాతో 366 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణంతో పాటు 21 రేడియల్ రోడ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

మరొకవైపు చారిత్రక మూసీ నదికి పూర్వవైభవం తీసుకొచ్చేలా మూసీ పునర్‌ నిర్మాణ పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకంగా 30,000 ఎకరాల భారీ విస్తీర్ణంలో ప్రతిష్టాత్మక 'ఫ్యూచర్ సిటీ' ని అభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. కాలుష్య రహిత హరిత రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా హైదరాబాద్‌లో ఇకపై పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని, నగరంలోని ఆటోలకు సైతం పర్యావరణహిత 'రెట్రోఫిట్‌మెంట్' విధానాన్ని తీసుకొచ్చామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.