BREAKING
శ్రీ వాసవి అమ్మవారి శరన్నవరాత్రి పోస్టర్ ఆవిష్కరణ ఏపీలోనే తొలిసారిగా అధునాతన పోర్టబుల్ వైద్య సేవలు ఇంటి పట్టా ఉన్న ప్రతి ఒక్కరూ గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవాలి టెలివిజన్‌లోకి రానున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’.. ఏడు బిలియన్ల ఫ్రాంచైజీ నుంచి భారీ స్పిన్‌ఆఫ్ సిరీస్ ప్రకటన ఎన్‌హెచ్‌–44 ఆరు లేన్ల విస్తరణ పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి* 80 శాతం రాయితీపై ఉలవ విత్తనాలు వరి పంటకు మోగి పురుగు నివారణకు స్ప్రే మూడో వన్డేలో రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. పెళ్లిపీటలెక్కిన ప్రముఖ హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్.. కోడీ జాన్‌తో వివాహం ఖరారు, ఫొటోలు వైరల్ మున్నూరు కాపు సంఘం ఖమ్మం నగర అధ్యక్షులుగా రాపర్తి శరత్ ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వీక్ష ది స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ ప్రజా పాలన అంటే ప్రజలకు మాట ఇచ్చి మర్చిపోయే పాలన. మంత్రి మాట లెక్కచేయని గ్రామ కాంగ్రెస్ నాయకులు

ఓబీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం

Select Suryaa Now
ఓబీసీ సింహ గర్జనను విజయవంతం చేద్దాం
  • రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పారిజాతం నరసింహారెడ్డి

మన దేశంలో సామాజిక సమతుల్యతను, బహుజనుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం గొల్లపల్లిలో ‘ఓబీసీ సింహగర్జన’ మహాసభ పీసీసీ ఓబీసీ ఛైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్నారు. ఓబీసీల హక్కుల కోసం, రాజ్యాంగబద్ధమైన పదవులలో తగిన రిజర్వేషన్ల సాధన కోసం, మరియు "జిస్కి జిత్ని సంఖ్య - ఉత్ని హిస్సేదారి" (ఎవరి సంఖ్య ఎంతైతే, అంత వాటా) అనే నినాదాన్ని సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నానాని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షులు పారిజాత నర్సింహ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు, (04.10.2026) మధ్యాహ్నం 3:00 గంటలకు శంషాబాద్ మండలం  గొల్లపల్లిలో జరగనుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా AICC ఓబీసీ ఛైర్మన్డా అనిల్ జైహింద్ యాదవ్,  పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,  AIPC చైర్మన్ మధు యాస్కీ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత్ రావు AICC ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోఆర్డినేటర్
 కొప్పుల రాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు మరియు ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు పాల్గొననున్నారని పారిజాత తెలిపారు.  సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, ఓబీసీ సోదరులు, యువకులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి… శంషాబాద్ గడ్డపై జరగబోయే ఈ 'ఓబీసీ సింహగర్జన' సభను విజయవంతం చేయాలని పారిజ్విాత జ్ఞప్తి చేశారు.

- శేరిబాయి గణేష్ : నేచర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి.