BREAKING
ఇరాన్‌తో యుద్ధం కోసం లాజెస్ వైమానిక స్థావరం వాడకంపై ప్రాసిక్యూటర్ల దర్యాప్తు ప్రజా ప్రయోజనమే జర్నలిజం ప్రధాన లక్ష్యం -వృత్తిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు పాత్రికేయులు : ఎమ్మెల్యే పులివర్తి నాని శరీరంలో తరచూ వచ్చే ఆరోగ్య సమస్యలకు అసలు కారణాలు ఇవే.. నిపుణులు ఏం చెబుతున్నారు? శ్రీనివాసస్కూల్లోసరికొత్తబియ్యాంసేకరణ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. షక్ ట్రస్ట్ నో వన్ స్టోరీ ఇదే స్పానిష్‌ గడ్డపై హోరెత్తిన నిరసనల హోరు రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్ పామూరు పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అడవిలో తలలేని శవం.. ఊహించని ట్విస్టులతో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు మెగాస్టార్, విక్టరీ వెంకటేష్‌లతో చిందేసిన ఈ భామ ఎవరో తెలుసా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుందరి 97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఓటీటీలోకి వస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

Select Suryaa Now
తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

ధరల వ్యత్యాసం, కొనుగోళ్లపై విచారణ జరపాలి    రైతుసంఘ జిల్లా నేత లక్కు 
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతటా ఈ సంవత్సరం పొగాకు రైతులు తీవ్రమైన నష్టాలకు గురైనారని ఈ. పి. రైతుసంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి లక్కు కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ధరలు, వేలంలో కొనుగోళ్లపై పోగాకుబోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరపాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. వేలంకేంద్రాల్లో పొగాకు కొనుగోలు అనుమతులు ఇచ్చినంత వరకు కొనుగోలు చేసి కొనుగోళ్ల ప్రక్రియను నిలుపుదల చేశారని, మరలా పొగాకు బోర్డు అనుమతితో రైతులు అదనంగా పండించిన పొగాకును కొనుగోలు చేయడం మొదలుపెట్టారన్నారు. యుద్ధాల వలన ఎగుమతులు లేవని జీఎస్టీ 40 శాతం వలన కొనుగోలు తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉన్నాయని అందువల్లనే రైతులకు మద్దతు ధర రావడంలేదని పొగాకు బోర్డు ప్రభుత్వం కొనుగోలుదారులు ఇప్పటివరకు చెబుతూ ఉన్నారు. అయితే పొగాకు బోర్డు ప్రకటించిన దానికన్నా 100 మిలియన్ కిలోలు అదనంగా పొగాకు ఉత్పత్తి చేశారు. ఈ అదనంగా ఉత్పత్తి చేసిన పొగాకును కొనుగోళ్లకు రెండవ దఫా బోర్డులు ఉపక్రమించాయి. అయితే ధరల నిర్ణయంలో మాత్రం ఏ మాత్రం మెరుగుదల కనిపించడం లేదు. ఎలిమినో ప్రభావం వర్షాలు పడవు పంటలు పండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కానీ ప్రభుత్వాలు  పంటలు పండించే విధానంలో మార్పులు తెచ్చుకోవాలని వాతావరణాన్ని అర్థం చేసుకొని వ్యవసాయం చేయాలని పలు సూచనలు చేస్తున్నారు. అంటే వచ్చే సంవత్సరం పొగాకు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. అలాగే పొగాకు బోర్డు కూడా ఒక బారన్  కు 3 ఎకరాలు మాత్రమే పండించాలని  ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో వెంకట్రావు పల్లె, ముస్తాపురం, జాలయ్య నగరం తదితర గ్రామాలలో పొగాకు బోర్డు అధికారులు రైతులకు సూచనలు చేశారు. పొగాకు బోర్డు గతంలోనే రాష్ట్రవ్యాప్తంగా 81 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం పొగాకును మితంగానే కొనే పరిస్థితిలో ఉన్నాయనేది అర్థమవుతుంది. ఈ మొత్తం పొగాకు కొనుగోలు వ్యవహారం మీద విచారణ జరపాల్సిన అవసరం కూడా ఉంది. వేలకోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెట్టే పొగాకు పంటను పండించే రైతులను ఇలా సంక్షోభంలోకి నెట్టడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నదని ప్రసాద్ విమర్శించారు .
పొగాకు వేలంలో గ్రేడింగ్ పేరుతో రైతులకు అన్యాయం 
 తక్షణమే చర్యలు తీసుకోవాలి
 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్
డి.సి. పల్లి  పొగాకు వేలం కేంద్రంలో 2026 అక్టోబర్ 1న జరిగిన వేలం వివరాలను పరిశీలిస్తే, గ్రేడింగ్ విధానం పొగాకు రైతాంగాన్ని తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నదని స్పష్టమవుతున్నదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
టొబాకో బోర్డు నివేదిక ప్రకారం ఆ రోజు వేలానికి 438 బేళ్లు రాగా, 334 మాత్రమే అమ్ముడయ్యాయి. 99 బేళ్లు (సుమారు 23 శాతం) తిరస్కరణకు గురయ్యాయన్నారు.వీటిలో 71 బేళ్లకు అసలు బిడ్ రాలేదు. అమ్ముడైన 44,854 కిలోల్లో బ్రైట్ గ్రేడ్ కేవలం 8.73 శాతం కాగా, మీడియం 69.34 శాతం, లో గ్రేడ్ 21.94 శాతంగా ఉంది. సీజన్ మొత్తంలో బ్రైట్ వాటా 17.33 శాతం ఉండగా, ఈరోజు అందులో సగానికి పడిపోయింది. లో గ్రేడ్ సగటు ధర సీజన్‌లో కిలోకు 149.67 రూపాయలు ఉండగా, ఈరోజు 129.63కి తగ్గింది. ఫలితంగా ఈరోజు సగటు ధర 187.41 కాగా, సీజన్ సగటు 204.37. ఈ ఒక్క రోజే సగటున కిలోకు సుమారు  17 రూపాయలు తగ్గడంతో, అమ్మిన పొగాకుపై రైతులు సుమారు  7.6 లక్షలు కోల్పోయారు.
గ్రేడ్ల మధ్య ధరల తేడా అపారంగా ఉంది. బ్రైట్‌కు కిలోకు 245, మీడియంకు  198, లోగ్రేడ్ కు 129 మాత్రమే లభిస్తున్నాయి. నాణ్యమైన పొగాకును మీడియం, లో గ్రేడ్లలో చేర్చితే రైతుకు బేలుకు వేల రూపాయల నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో వేలానికి ముందు గ్రేడ్‌వారీ ధరలు ప్రకటించకపోవడంతో, రవాణా, కూలీ ఖర్చులు భరించి వేలం కేంద్రానికి వచ్చిన రైతు, ఎంత ధర వచ్చినా అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నాడు.
కొనుగోళ్లు కొద్ది కంపెనీల చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం కూడా రైతుకు నష్టం చేస్తున్నది. ఈరోజు ఐటీసీ (37.47శాతం ), షేక్ మస్తాన్ సాహెబ్ టొబాకో ఎంటర్‌ప్రైజెస్ (17.5శాతం ), డెక్కన్ టొబాకో ఎక్స్‌పోర్ట్స్ (10.53శాతం ), గాడ్‌ఫ్రే ఫిలిప్స్ (10.43శాతం ) కలిసి సుమారు 76 శాతం కొనుగోలు చేశాయి. మొత్తం 19 కంపెనీల్లో ఈరోజు 10 మాత్రమే పాల్గొన్నాయి. సీజన్ మొత్తంలో ఒక్క ఐటీసీ వాటానే 48.74 శాతం.
రైతు సంఘం డిమాండ్లు: 
వేలానికి ముందే గ్రేడ్‌వారీ కనీస (రిజర్వ్) ధరలు ప్రకటించాలి.
గ్రేడింగ్ ప్రమాణాలను వేలం కేంద్రంలో బహిరంగంగా ప్రదర్శించాలి,రైతు ప్రతినిధుల సమక్షంలో గ్రేడింగ్ చేయాలి,
గ్రేడ్‌పై అభ్యంతరం ఉన్న రైతుకు స్వతంత్ర అధికారి వద్ద రీ-గ్రేడింగ్ అవకాశం కల్పించాలని,
బిడ్ రాని (ఎన్ బి ) బేళ్లకు కనీస ధర హామీ ఇవ్వాలని,తిరస్కరణ పేరుతో రైతును తక్కువ ధరకు అమ్ముకునేలా ఒత్తిడి చేయకూడదని డిమాండ్ చేశారు.
అన్ని వేలం కేంద్రాల గ్రేడ్‌వారీ గణాంకాలను పోల్చి, అసాధారణ తేడాలు ఉంటే టొబాకో బోర్డు తక్షణమే విచారణ జరపాలన్నారు.
ఎక్కువ కంపెనీలు వేలంలో పాల్గొని పోటీ ధర లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టొబాకో బోర్డు చర్యలు తీసుకోవాలి.
ఈ డిమాండ్లపై తక్షణమే స్పందించకపోతే రైతులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు.