నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. షక్ ట్రస్ట్ నో వన్ స్టోరీ ఇదే
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఓటీటీ వేదికగా ప్రతివారం ఎన్నో కొత్త ప్రాజెక్ట్లు వస్తుంటాయి కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిందీ సిరీస్ ‘షక్ ట్రస్ట్ నో వన్’. అనుమానం అనేది మనిషి జీవితంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్‌కు రెన్సిల్ డి సిల్వా దర్శకత్వం వహించడంతో పాటు కథను అందించారు. ఊహకందని ట్విస్టులు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే ఈ సిరీస్ ప్రస్తుతం సస్పెన్స్ జోనర్ ప్రియులను కట్టిపడేస్తోంది.
ఈ సిరీస్ కథాంశం విషయానికి వస్తే, అన్విత మరియు అలోక్ దంపతులకు వివాహం జరిగి చాలా ఏళ్లయినా సంతానం కలగదు. అయితే ఎట్టకేలకు చాలా కాలం తర్వాత అన్విత గర్భవతి అయి పండంటి పాపకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు ఆపేక్ష అని పేరు పెట్టుకుంటారు. కానీ పుట్టిన బిడ్డతో పాటు అన్విత ఇంకా హాస్పిటల్‌లో ఉండగానే ఓ రాత్రి ఆపాక్షను ఎవరో కిడ్నాప్ చేస్తారు. లేకలేక పుట్టిన బిడ్డ కనుమరుగవడంతో ఆ దంపతులు గుండెలు పగిలేలా రోధిస్తారు. ఎంత వెతికినా పాప జాడ దొరకకపోవడంతో అన్విత మానసిక క్షోభకు గురవుతుంది.
ఎనిమిదేళ్ళు గడిచినా ఆపేక్ష ఆచూకీ లభించదు కానీ ప్రతి ఏటా ఆపేక్ష పుట్టినరోజున కిడ్నాపర్ అన్వితకు పాప ఫొటో పంపిస్తూ టార్చర్ పెడుతుంటాడు. దీంతో అన్విత ప్రతి ఒక్కరినీ అనుమానిస్తూ పిచ్చిదానిలా మారుతుంది. అసలు ఆపేక్షను ఎత్తుకెళ్ళిన అసలు వ్యక్తులు ఎవరు, ప్రతిఏటా ఫొటోలు పంపుతున్నదెవరు అనే ఆసక్తికరమైన నిజాలు ఈ సిరీస్‌లో చూడవచ్చు. మొత్తం ఏడు భాగాలతో రూపొందిన ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ మరియు ఇన్వెస్టిగేటివ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్‌లో ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.