BREAKING
ప్రజల అవసరమే ప్రాధాన్యతగా.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి కృషి దోమ తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం..! స్వచ్ఛత స్పెషల్ క్యాంపియన్ -6 నో ప్రారంభించిన ఏరియా జిఎం వి కృష్ణయ్య తాగేటివారిపాలెం ఎస్ఎంసి ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల జయకేతనం మెట్టు అగ్రి బిజినెస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఘనంగా తాన్ల లేబొరేటరీ సర్వీసెస్ ప్రారంభోత్సవం* తిరుపతి టు వారణాసి సంకల్పయాత్ర.. ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే జారె న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి చౌటపాలెంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అమెజాన్ నౌ’ అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సేవను 120కి పైగా నగరాలకు విస్తరించిన అమెజాన్ రాష్ట్రస్థాయిలో కృష్ణపట్నం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విజయం. పెంచలకోనలో వైభవంగా శ్రీవారి సేవలు తిరుపతిలో వైసీపీకి బిగ్ షాక్ -కొర్లగుంటలో కూటమి హవా-కంచుకోట బద్దలు -వైసీపీని వీడి సైకిల్ ఎక్కిన యువత, మహిళలు ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందమందికి పైగా టిడిపిలో చేరిక బి.ఎన్.రెడ్డి రోడ్డు పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్

Select Suryaa Now
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత.
పరిశుభ్రత, పౌష్టికాహారం, తాగునీరు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి. 
అవసరమైన మరమ్మతులు, సదుపాయాల కోసం అంచనా ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలి.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

సంగారెడ్డి,  ; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, పౌష్టికాహారం, సురక్షితమైన తాగునీరు, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో  మౌలిక సదుపాయాలు, మరమ్మతుల అవసరాలు, విద్యార్థుల భద్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, ఆహారం తయారీ, నిల్వ, పంపిణీలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.అలాగే వసతి గృహాల్లో తగిన గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి గదిలో అవసరమైన ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీటి సదుపాయాలు సక్రమంగా ఉండాలని  తెలిపారు.ముఖ్యంగా బాలికల వసతి గృహాల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులు, తలుపులు, రన్నింగ్ వాటర్ తదితర సదుపాయాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.  అవసరమయ్యే పనులకు సంబంధించి పూర్తి వివరాలతో అంచనా ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని ప్రిన్సిపాళ్లు, జిల్లా కోఆర్డినేటర్లను ఆదేశించారు.విద్యార్థులు రాత్రి వేళల్లో కూడా సురక్షితంగా సంచరించేలా రెసిడెన్షియల్ పాఠశాలల క్యాంపస్ పరిసరాల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకునేలా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల జిల్లా కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాళ్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.