రాష్ట్రస్థాయిలో కృష్ణపట్నం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విజయం.
ముత్తుకూరు, అక్టోబర్ 3 మేజర్ న్యూస్ : కృష్ణపట్నం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థిని విద్యార్థులు కిషోర్, జ్యోతిర్మయి రెడ్డి, సిద్ధార్థ లు విజయం సాధించారు. గత నెలలో వారధి ఇండియా ఫౌండేషన్ వారు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ భాగస్వామ్యంతో వార్షిక ఆన్లైన్ కాంపిటేషన్ 2026 నందు జిల్లా స్థాయిలో వ్యాసరచన విభాగంలో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి నాణ్యమైన విద్య పునాది అంశంలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకుని రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో విజయం సాధించి హైస్కూల్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరళ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా 27 వేల రూపాయలు నగదు బహుమతి అందుకున్నట్లు పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో పాటు శిక్షణ కల్పించిన టీచర్ ఆర్ విజయ్ కుమార్, గ్రామస్తులు అభినందించారు