తిరుపతిలో వైసీపీకి బిగ్ షాక్ -కొర్లగుంటలో కూటమి హవా-కంచుకోట బద్దలు -వైసీపీని వీడి సైకిల్ ఎక్కిన యువత, మహిళలు ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందమందికి పైగా టిడిపిలో చేరిక
తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నగరంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న కొర్లగుంట 7వ డివిజన్‌లో వైసీపీ ఖాళీ అవుతోంది. వైసీపీ నాయకుడు కంచి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఏకంగా 100 మంది యువత, మహిళలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్, తాతయ్యగుంట ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ, నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, గుణ, ఎస్వీఎం శ్రీధర్, తిరుమల టిడిపి అధ్యక్షులు సుద్దాల రాజు యాదవ్ తో కలసి యువతకు మహిళలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ నేతలు తో కలసి ఆవిష్కరించారు.
జేబీ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ కొర్లగుంట ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోట అని, గత ఎన్నికల్లో ఇక్కడ 10 వేల మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారన్నారు. "గతంలో టీడీపీలో ఉన్న దిలీప్ కుమార్ లాంటి యువతను వైసీపీ నాయకులు బలవంతంగా భయపెట్టి తమ పార్టీలోకి లాక్కెళ్లారు. వైసీపీ అరాచకాలు, అన్యాయాలను భరించలేక, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంపై నమ్మకంతో నేడు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పరుగులు తీస్తోందని జేబీ అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉన్నత చదువులతో ముందుకు సాగాలని, అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ భారీ చేరికలతో తిరుపతి నగరంలో, ముఖ్యంగా కొర్లగుంటలో టీడీపీ మరింత బలపడినట్లయింది. రానున్న స్థానిక ఎన్నికల ముందు వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.