మెట్టు అగ్రి బిజినెస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
హైదరాబాద్, అక్టోబర్ 3: అగ్రి బిజినెస్ రంగంలోని వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చి, వారి వ్యాపార అభివృద్ధికి అవసరమైన నెట్ వర్కింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా మెట్టు అగ్రిబిజినెస్ అసోసియేషన్ ఏర్పాటైంది. అగ్రిబిజినెస్ రంగానికి చెందిన వ్యాపారవేత్తలతో ఏర్పాటు చేసిన మెట్టు అగ్రి బిజినెస్ అసోసియేషన్ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో అసోసియేషన్ అభివృద్ధి, సభ్యుల వ్యాపార ప్రోత్సాహం, పరస్పర సహకారం, నెట్‌వర్కింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఛైర్మన్ గా జీ శేఖర్ రెడ్డి, అధ్యక్షుడిగా కిరణ్ కుమార్, వైస్ ఛైర్మన్ గా ఎన్. మహేశ్, ఉపాధ్యక్షుడికి ఎమ్. మహేశ్, కోశాధికారిగా కార్తిక్ పటేల్, జాయింట్ సెక్రటరీగా నరేశ్, కోశాధికారిగా కోటేశ్వరరావు ఎంపికయ్యారు.