BREAKING
ప్రమాదంలో గాయపడిన కూలీలను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే జారె న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతి చౌటపాలెంలో బీజేపీ జెండా ఆవిష్కరణ అమెజాన్ నౌ’ అల్ట్రా ఫాస్ట్ డెలివరీ సేవను 120కి పైగా నగరాలకు విస్తరించిన అమెజాన్ రాష్ట్రస్థాయిలో కృష్ణపట్నం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విజయం. పెంచలకోనలో వైభవంగా శ్రీవారి సేవలు తిరుపతిలో వైసీపీకి బిగ్ షాక్ -కొర్లగుంటలో కూటమి హవా-కంచుకోట బద్దలు -వైసీపీని వీడి సైకిల్ ఎక్కిన యువత, మహిళలు ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వందమందికి పైగా టిడిపిలో చేరిక బి.ఎన్.రెడ్డి రోడ్డు పనులను పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రామళ్ళకోటలో ఘనంగా 456వ ఉచిత వైద్య శిబిరం పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నకిలీ పాస్ పుస్తకాలకు ఇక చెక్ బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వెల్లడి చట్టాలపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి : జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్ ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మార్కాపురంలో అవగాహన ర్యాలీ దేవరగట్టున సందర్శించిన ఆర్ డి ఓ

మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

Select Suryaa Now
మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

అనుమతుల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు.. పెద్ద గుంతలపై ఆగ్రహం

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 3):
ఎదులాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న మట్టి తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నప్పటికీ, వాటిని ఆసరాగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా పెద్దపెద్ద గుంతలు తీసి మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తవ్వకాల కారణంగా భూమి దెబ్బతినడంతో పాటు పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మట్టి తవ్వకాలను నిలిపివేయించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అనుమతులు ఉన్నాయనే కారణంతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడం సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు.నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మట్టి తవ్వకాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, భూమిని దెబ్బతీసేలా పెద్ద గుంతలు తీయకుండా పర్యవేక్షించాలని వారు కోరారు. ఈ విషయాన్ని మైనింగ్ అధికారులు, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమరేందర్, సింగిల్‌విండో డైరెక్టర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు శంకరప్ప, జమాల సత్యయ్య, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ గుర్రం రమేష్.