వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన
వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన వ్యవసాయ అధికారి సతీష్,ఏఎంసీ చైర్మన్ బోయినీ నిర్మల జయరాజు.
కోహెడ ; కోహెడ మండల రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్నీ మండల వ్యవసాయ అధికారి సతీష్,ఏఎంసీ చైర్మన్ బోయినీ నిర్మల జయరాజు ,వైస్ చైర్మన్ భీమిరెడ్డి తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీ కొనసాగుతున్నట్లు తెలిపారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్ (ఎన్ ఏం ఈ ఓ -ఓఎస్ ) కింద కదిరి లేపాక్షి–1812 రకం వేరుశనగ విత్తనాలను 100 శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలానికి మొత్తం 200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మంజూరైనట్లు తెలిపారు. ఒక సంచి 30 కిలోలు అర్ధ ఎకరాకు, రెండు సంచులు 60 కిలోలు ఒక ఎకరాకు సరిపోతాయని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామ సర్పంచులు, ఏ ఏం సి డైరెక్టర్లు,రైతులు శెట్టి సుధాకర్, జీవన్,సురేష్ ఏఈఓలు మైపాల్‌రెడ్డి, శివకుమార్, శ్రీధర్ రెడ్డి,రాకేష్, రఘు,రూప, శ్రీనివాస్ తో పాటు పలువురు రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.