వరి పంటకు మోగి పురుగు నివారణకు స్ప్రే
వరి పంటకు మోగి పురుగు నివారణకు స్ప్రే
రామాయంపేట ; నిజాంపేట: మండల కేంద్రానికి చెందిన రైతులు పెద్దపైడి రాజిరెడ్డి, పప్పుల కిష్టారెడ్డి సాగు చేస్తున్న వరి పంటలకు మోగి పురుగు సోకడంతో నివారణ చర్యలు చేపట్టారు.రైతు రాజిరెడ్డి తన రెండు ఎకరాల వరి పొలంలో కిష్టారెడ్డి తన పది ఎకరాల వరి పొలంలో మోగి పురుగు వృద్ధి చెందడంతో పురుగు నివారణ మందును పిచికారీ చేయించారు. పంటకు పురుగు సోకిన వెంటనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లు రైతులు తెలిపారు.