80 శాతం రాయితీపై ఉలవ విత్తనాలు
తాడిమర్రి వెంకటేష్ సూర్య రిపోర్టర్ : ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉలవ విత్తనాలను 80 శాతం రాయితీపై అందిస్తోంది. ఇందులో భాగంగా శనివారం తాడిమర్రి మండలంలో రైతులకు ఉలవ విత్తనాలను పంపిణీ చేశారు.కిలోకు రూ.14.80కే రైతు వాటా.. 10 కిలోల బ్యాగు రూ.148 ఉలవ విత్తనాల పూర్తి ధర కిలోకు రూ.74 కాగా.. ప్రభుత్వం 80 శాతం రాయితీ కింద రూ.59.20 భరిస్తోంది. రైతు వాటాగా కిలోకు రూ.14.80 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 10 కిలోల బ్యాగు పూర్తి ధర రూ.740 కాగా.. రాయితీ అనంతరం రైతు కేవలం రూ.148 చెల్లించి పొందవచ్చు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి శేఖర్‌నాయక్ సూచించారు. ఉలవ సాగుతో అదనపు ఆదాయంతోపాటు భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. అర్హత కలిగిన రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, మొబైల్ నంబరుతో సంబంధిత రైతు సేవా కేంద్రంలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రెడ్డి లక్ష్మి, ఎంపీడీవో వెంకట రంగారావు, డిప్యూటీ ఎంపీడీవో విజయ్ శేఖర్‌నాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు