వీక్ష ది స్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
స్థానిక బైరాగిపట్టెడ ఆర్చి సమీపంలోని వీక్ష స్కూల్, ఆర్‌కే విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ, వాటి పోషక విలువలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌కే గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణ రెడ్డి ఫుడ్ ఫెస్టివల్ ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే సమతుల్య ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. ఆర్‌కే విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి ఆర్‌కే విమల మాట్లాడుతూ ఆహారంలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ శరీరానికి అందించే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విటమిన్లు శరీర ఆరోగ్యానికి, ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు, ఫైబర్ జీర్ణక్రియకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.విద్యార్థులు పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. ఫుడ్ ఫెస్టివల్ ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహనతో పాటు సృజనాత్మకత, ప్రదర్శన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి అవకాశం కలిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని ఫుడ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేశారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి