గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష:
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :
గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ మరియు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమ్మిట్‌కు హాజరయ్యే దేశ విదేశాల ప్రతినిధులు, ప్రముఖ అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే సమ్మిట్ ప్రాంగణాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.