వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బుడ్డే హనుమంతరెడ్డికి మెట్టు విశ్వనాథ్‌రెడ్డి నివాళులు
అనంతపురంబ్యూరో : మండల పరిధిలోని మురడి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుడ్డే హనుమంతరెడ్డి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్‌రెడ్డి మురడి గ్రామానికి చేరుకున్నారు.
అనంతరం హనుమంతరెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని హనుమంతరెడ్డికి నివాళులర్పించారు.