BREAKING
టాలీవుడ్‌లో ఆసక్తికర పోరు.. స్టార్ హీరో సినిమాకు పోటీగా శ్రీవిష్ణు కొత్త మూవీ! పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవలందించాలి -స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి: టీటీడీ జేఈఓ ప్రభల గోపీనాథ్ జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి హనుమాన్ అంశ్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద మరో అంచనాలు పెంచే చిత్రం! ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్, నక్షత్ర నటించిన సినిమా ఎలా ఉందంటే? ఘనంగా నల్లా నరసింహులు గారి శత జయంతి వేడుకలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో చీరలు, దుప్పట్లు పంపిణి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ ప్రాజెక్ట్.. ఓటీటీలోకి ఫస్ట్ సెమిస్టర్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఒకే రోజులో 10 సాధారణ ప్రసవాలు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి  ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన

అనంతపురం బ్యూరో : ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని, ఈ ప్రక్రియ పేరుతో తొలగించిన ఓట్లను యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ కృష్ణ కళామందిర్‌ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం టవర్‌ క్లాక్‌ వద్ద నిరసన తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ పేరుతో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు తొలగించారంటూ నిరసనకారులు ఆరోపించారు. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని, ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఓటర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.