వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
*వైభవం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
*500 ఏళ్ల చారిత్రాత్మక శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం
*స్వామివారి కల్యాణాన్ని వీక్షించి పులకించిన భక్తజనం
*ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్, జల్ పల్లి సర్కిల్ పరిధి, మామిడిపల్లిలో అతి ప్రాచీనమైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నగర శివారు మాడిపల్లి గ్రామంలో సుమారు 500ఏళ్ల చారిత్రాత్మక శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, స్వయంభు శ్రీ భూదేవి సమేతగా శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిగా వెలిసారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం బాల భోగము ఆవాహనము, బలిహారము నిర్వహించి, 11గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, మంగళవాయిద్యాలు మోగుతుండగా, స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. భక్తులు గోవింద నామ స్మరణలతో పులకించి పోయారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కళ్యాణాన్ని కనులారా తిలకించి పరవశించిపోయారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథులుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కళ్లెం నరేష్ గౌడ్, కమిటీ సభ్యులు చీమలదారి చెన్నయ్య, గొండ్యాల శేఖర్
ముదిరాజ్, ఎలుకపల్లి అనిత, కానుగుల భాస్కర్, గుర్జని రాధిక, అర్చకులు ఉండేకారీ సుధీర్ కుమార్ వారిని ఘనంగా సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కల్యాణ మహోత్సవంలో మామిడిపల్లి, పహాడీషరీఫ్, జల్ పల్లి, శ్రీరామ కాలనీ, కాటేదాన్, శంషాబాద్, మైలార్దేవ్ పల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మధ్యాహ్నం ఎడ్ల కృష్ణారెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామి వారిని మామిడిపల్లి గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్థులు భక్తిశ్రద్దల నడుమ స్వామివారికి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాల్ సతీష్ గౌడ్, దాతలు ఎడ్ల కృష్ణారెడ్డి, ఎడ్ల రఘువీర్ రెడ్డి, ఎడ్ల వాసుదేవారెడ్డి, దామోదర్ సచిన్ సోని, మాజీ చైర్మన్ గోపాల్ యాదవ్, స్థానిక నాయకులు లాల్ విజయ్ గౌడ్, గుర్జని గణేష్ గౌడ్. సురేష్ గౌడ్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.