హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
ప్రకాశం మాదిగ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి :దళిత నేత నీలం నాగేంద్ర రావు
కనిగిరి ,మేజర్ న్యూస్ :హత్యకు గురైన కుడుముల ప్రకాశం మాదిగ కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగం ,వ్యవసాయ భూమి కేటాయించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు డిమాండ్ చేశారు. బుధవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయం ముందు ప్రకాశం కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నీలం నాగేందర్రావు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు నెల ఐదవ తేదీన కనిగిరి మండలం మాచవరం గ్రామానికి చెందిన కుడుముల ప్రకాశం మాదిగను రజక కులస్తులైన భూతంవారిపల్లి మధు ముఠా సభ్యులు 12 మంది దారుణంగా దాడి చేసి అత్యాయత్నం చేశారని గాయపడ్డ కుడుముల ప్రకాశాన్ని ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్చగా చికిత్స పొందుతూ అక్టోబర్ 14వ తేదీన మరణించాడని అన్నారు. ఈ ఘటన క్రైమ్ నెంబర్ 335/25 హత్య మరియు ఎస్సీ ,ఎస్టీ యాక్ట్ గా కనిగిరి పోలీస్ స్టేషన్లో నమోదయిందని తెలిపారు .చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ హత్య కేసుల్లో రెండు నెలల్లో బాధిత కుటుంబానికి రిలీఫ్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వవలసి ఉంది కానీ కనిగిరి ప్రకాశం జిల్లా నుండి విడిపోయి మార్కాపురం జిల్లాలో కలవటం వలన మార్కాపురం కలెక్టరేట్ అధికారుల అలసత్వం వలన హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి రిలీఫ్ మంజూరు కాలేదన్నారు .నెల రోజుల క్రితం మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతను కలిసి తాము ఫిర్యాదు చేయగా ప్రకాశం కుటుంబ సభ్యులకు పునరావాసం కొరకు రిపోర్టు పంపాలని కనిగిరి ఆర్డీఓ కు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఆర్డిఓ ఆఫీసుకు చేరిన కలెక్టర్ ఆదేశాలు పక్కనే ఉన్న కనిగిరి ఎమ్మార్వో ఆఫీస్ కి చేరలేదన్నారు. తాము కనిగిరి ఆర్డిఓ కార్యాలయం ఏవో ఇమ్మానియేల్ తో మాట్లాడి కనిగిరి ఎమ్మార్వో ఆఫీస్ కు కలెక్టర్ ఆదేశాల కాఫీ ఇప్పిచ్చామన్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రకాశo కుటుంబానికి రిలీఫ్, ప్రభుత్వ ఉద్యోగం ,వ్యవసాయ భూమి ఇవ్వాలని నాగేందర్రావు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు కాకుమాను రవి,కన్వీనర్ మేడికొండ మురళి, సామాజిక ఉద్యమకారులు పాలేటి కోటేశ్వరరావు,న్యాయవాది తెళ్ళ ఉదయ్,దేవరపల్లి గోపి వున్నారు.