BREAKING
డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కెనడా కసరత్తు దేవస్థానం నిధులు దుర్వినియోగం సరికాదు దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు పశ్చిమ ఉక్రెయిన్ నగరమైన లుట్స్క్‌పై రష్యా డ్రోన్ దాడి ఇంద్రకీలాద్రిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యాలో ఏఐ సృష్టించిన నకిలీ ఎలుగుబంట్ల చిత్రాలపై కఠిన చర్యలు అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలతో రణరంగంగా మారిన రాజధాని తిరానా నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గూగుల్‌తో చర్చిస్తున్న యూరోపియన్ కమిషన్

పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి

Select Suryaa Now
పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి

రేపల్లె మేజర్ న్యూస్; రేపల్లె మండలం పెనుమూడి చెక్ పోస్ట్ ఎదురుగా ఉన్న 30 సెంట్ల ఖాళీ స్థలంలో ప్రభుత్వం 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పి పెనుమూడి నదీ పరివాహక  ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చైతన్య వేదిక కన్వీనర్ కొండపల్లి వెంకటేశ్వరరావు,ది ఆది ఆంధ్ర నవ బుద్ధిష్ట్ సొసైటీ కార్యదర్శి న్యాయవాది దోవా రమేష్ రాంజీ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోయిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం స్వీకరించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపల్లె పట్టణంలోని అంబేద్కర్ భవనం వద్ద బౌద్ధ ధర్మ ప్రవర్తన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 11వ శతాబ్దం వరకు రేపల్లె ప్రాంతం లో భట్టిప్రోలు కేంద్రంగా బౌద్ధం విరజిల్లిందని, కృష్ణ పుష్కరాల సమయానికి పెనుమూడి వద్ద బుద్ధ విగ్రహాన్ని జాతీయ రహదారికి పక్కన ఏర్పాటు చేస్తే రేపల్లె ప్రాంతం మరింత ఇనుముడింప చేస్తుందన్నారు. 
ఇప్పటికే రేపల్లె శాసనసభ్యులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు అనగాని సత్య ప్రసాద్ దృష్టికి అంబేద్కర్ వాదులు బుద్ధిష్టులు సదరు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినందున మంత్రి స్థానుకులంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాల్లో నేటికీ బౌద్ధం అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతుందంటే అందుకు ప్రధాన కారణం బుద్ధుడు బోధించినటువంటి శాంతి మార్గమేనన్నారు. భౌద్ద మార్గాన్ని అనుసరించడం వలన ప్రపంచ దేశాల్లో బోధిసత్వ బిరుదుతో కీర్తింపబడినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ మాత్రమే అని కీర్తించారు. బుద్ధుడు బోధించిన మార్గాన్ని పాటిస్తూ నవ బుద్ధుడు అంబేద్కర్ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానోపాధ్యాయులు ఆవుల సాంబశివరావు గాలి సురేష్ కుమార్  మేకతోటి మోక్షానందం తదితరులు పాల్గొన్నారు.