సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి
రీ సర్వే ప్రక్రియ సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేయాలని జెసి కల్పనా కుమారి అన్నారు. అద్దంకి మండలం రామాయపాలెం రెవిన్యూ పరిధిలో గల తిమ్మాయపాలెంలో జరుగుతున్న సర్వే ప్రక్రియను ఆమె బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేపట్టిన భూముల సర్వే వివరాలు వాట్సాప్ గ్రూపు ల ద్వారా రైతుల కు సమాచారం ఇస్తూ, ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తి చేయాలన్నారు. పాస్ పుస్తకాల్లో కొలతలకు భూమిపై కొలతలకు పోల్చు కునే విధంగా ఉండాలని సూచించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో విఆర్వోల తో సమీక్షించారు. పిజిఆర్ఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని అందుకునే విధంగా రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని వెల్లడించారు. తహసిల్దార్ శ్రీ చరణ్, సర్వేయర్, సిబ్బంది పాల్గొన్నారు.