BREAKING
బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసి, కంచె ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌కు వినతి ఎ ఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా .ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo రేడియల్ రోడ్ బాధితులు పరిహారం అందజేత 6 నుండి 8 వరకు'సేవ సేతు అభియాన్' క్యాంప్.

తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన 25 కుటుంబాలు.-- మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరిక

Select Suryaa Now
తెట్టెలపాడు నుంచి  కాంగ్రెస్ పార్టీ లో చేరిన 25 కుటుంబాలు.-- మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరిక

ఖమ్మం, (సూర్య బ్యూరో):తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బీఆర్‌ఎస్‌, ఎంఎల్‌, టీడీపీ పార్టీలను వీడి కాంగ్రెస్‌లో చేరాయి. పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు.ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనకు ప్రాధాన్యమిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. పేదలకు రేషన్‌ కార్డులు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీతో పాటు రైతులు, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు.కాంగ్రెస్‌లో చేరిన ప్రతి కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
*ఈ కార్యక్రమంలో..:* ఆత్మ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్‌ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కొప్పుల అశోక్‌, మాజీ ఎంపీపీ బోడా మంగీలాల్‌, పార్టీ మండల ఉపాధ్యక్షుడు సామా శ్రీనివాసరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్‌, నాయకులు పుసులూరి సురేష్‌, మాజీ ఎంపీటీసీ గోళ్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.