BREAKING
120 మంది నిరుపేదలకు భూమి చూపించాలని తహసీల్దార్ కు వినతి గీతంలో ఎడిటింగ్, ప్రచురణపై కార్యశాల సేవా సేతు పథకాన్ని సద్వినియోగం చేసుకోండి సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌గా సందీప్ కుమార్ బాధ్యతలు భాకరాపురం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వజనాల విశ్వాస్ నియామకం. స్వచ్ఛ పంచాయతీగా పత్తికొండకు రాష్ట్రస్థాయి పురస్కారం టిడిపి కూటమి ఆశయాలే రాష్ట్ర ప్రగతికి నిదర్శనం చుంచుపల్లి తండా వాసి మృతి.. .హరికృష్ణ మృతి పై పలు అనుమానాలు..? ప్రజావాణికి ,కేవలం రెండు దరఖాస్తులు మాత్రమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా అత్తిలి గోపాల్ హైదరాబాద్ జిల్లా బీజేపీ ఎండోమెంట్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా కె. ఉష తెర్లాం గ్రంథాలయం ... శోభాయ మానం : పాఠకులకు సరికొత్త మూత్ర విసర్జన నిలయం గొల్జాంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోళ్ల సచివాలయం ఉద్యోగికి ఘన సన్మానం

.ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo

Select Suryaa Now
.ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయo

 ఏలూరు మేజర్ న్యూస్  జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో గల సమావేశ మందిరంలో సోమవారం  నిర్వహించినారుఏలూరు జిల్లా  అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ వై. ప్రసాద్ రావు ఏ ఆర్ అదనపు ఎస్పీ శ్రీ జి ముని రాజా గారు ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు.ప్రజల సమస్య లను వేగంగా, నిష్పక్ష పాతంగా మరియు పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గారు స్పష్టం చేశారు.ఇందులో భాగంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ (ప్రజల సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ అడ్మిన్ ఏ ఆర్ అదనపు ఎస్పీ  స్వయంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులను కలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా ఆలకించి, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు మరింత సులభతరమైన సేవలు అందించేలా ఈ గ్రీవెన్స్ కార్యక్రమా న్ని పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి పారదర్శకమైన ధర్మ యాప్ ద్వారా చేపట్టారు. ఈ వేదికపై 38 పిర్యాదులు  అందినవి  ఫిర్యాదు లలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు ఆర్థిక మోసాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. చట్టప్రకారం నిష్పక్షపాత విచారణ జరిపి, నిర్ణీత గడువు లోగా నివేదిక లు సమర్పించాలని అధికారులను అదనపు ఎస్పీ అడ్మిన్  ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం పోలీసు శాఖ కీలక సూచనలు  దూర ప్రాంతాల నుండి నేరుగా జిల్లా కార్యాలయానికి రావాల్సిన శ్రమ లేకుండా, ప్రజలు తమ సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయా ల్లోనే ఫిర్యాదులు అందజేయవచ్చు.ఆన్‌లైన్ సేవలు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవారు ఇంట్లోనే ఉండి ‘Meekosam’పోర్టల్ ద్వారా తమ ఫిర్యాదులను నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ప్రజలు తమ ఫిర్యాదుల పురోగతి మరియు స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నెంబర్ నుసంప్రదించి సమాచారం పొందవచ్చని సూచించారు.ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజల నమ్మకాన్ని కాపాడుతూ బాధితులకు వేగంగా న్యాయం అందించడమే మా బాధ్యత అని అధికారులు తెలియ చేసినారు.