6 నుండి 8 వరకు'సేవ సేతు అభియాన్' క్యాంప్.
దర్శి మేజర్ న్యూస్.పొదిలి రోడ్డు నందు గల కరెంట్ ఆఫీసు వద్ద ఈ నెల 6 నుండి 8వ తేది వరకుపి. యం సూర్య ఘర్ ముఫ్త్ బిజీలీ యోజన పై ప్రత్యేక రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఈఈ డి .వెంకటేశ్వర్లు తెలిపారు. గృహ విద్యుత్ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ పై కేంద్ర ప్రభుత్వ సబ్సిడి, బ్యాంకు రుణాలు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు పై అధికారులు అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తు నుంచి ప్లాంట్ ఏర్పాటు వరకు మార్గదర్శకత్వం అందిస్తారని తెలిపారు. విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలని కోరారు.