BREAKING
పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ ఘనంగా మూడో రోజు దుర్గామాత పూజలు భక్తిశ్రద్ధలతో కొండా రత్తయ్య-నాగమణి గృహప్రవేశం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు రైతుల కష్టాలు. గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు అవనిగడ్డ కూటమిలో చిచ్చు: టీడీపీ నేతల వల్లే సమస్యలంటున్న జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ దుర్గామాత మండపాలకు 400 స్టీల్‌ ప్లేట్ల విరాళం

'సూర్య' కథనానికి స్పందించిన విద్యుత్ అధికారులు

Select Suryaa Now
'సూర్య' కథనానికి స్పందించిన విద్యుత్ అధికారులు

ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కల తొలగింపు.. వైర్ల బిగింపు

జీహెచ్‌ఎంసీ శంషాబాద్ పరిధిలోని మండల ఎమ్మార్వో కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారిన విషయంపై ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. కథనం వెలువడిన వెంటనే స్పందించిన శంషాబాద్ విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న విద్యుత్ వైర్లను సైతం గట్టిగా బిగించి తగిన చర్యలు చేపట్టారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా స్థానికులు పేర్కొంటున్నారు. ‘సూర్య’ దినపత్రికలో కథనం ప్రచురితమైన వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో పలు చోట్ల పేరుకుపోతున్న చెత్తాచెదారం, పారిశుద్ధ్య సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పోతుల నర్సింహా, మేజర్ స్యూస్ శంషాబాద్.