దుర్గామాత మండపాలకు 400 స్టీల్ ప్లేట్ల విరాళం
సూర్య, మాక్లూర్:
మాక్లూర్ మండలం గుంజిలి గ్రామ మహిళలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ముందడుగు వేశారు. అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ విస్తర్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగించడం పర్యావరణానికి మేలు చేస్తుందని భావించి, గ్రామ మహిళలందరూ కలిసి 400 స్టీల్ ప్లేట్లను కొనుగోలు చేసి దుర్గామాత మండపాలకు అందజేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళల ఐక్యతతో చేపట్టిన ఈ కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపు గోపి,మహేష్,భోజేందర్,శ్రవణ్, నితిన్,ముత్యం,కిషన్,రాజు,ఒడ్డేన్న,శంకర్,శివ,అనిల్ ,సవిన్,తదితరులు పాల్గొన్నారు.