సింహ గర్జన సభను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ అసత్యపు ఆరోపణలు
సూర్య బిక్కనూర్ :కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన,సింహగర్జన సభ అనుకున్న దానికంటే విజయవంతం కావడంతో, బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ మండిపడ్డారు. శనివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించడం సిగ్గుచేటన్నారు.బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నుండి పతనం ప్రారంభమైందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ డప్పు రవి, జిల్లా నాయకులు లక్ష్మణ్,మండల అధ్యక్షుడు తుడుం జీవన్, సంజీవ్ కుమార్ పాల్గొన్నారు