BREAKING
ఎయిర్‌పోర్టు నిర్వాసితుల నిరసన. హామీల అమలుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన. సామాన్యుడిలా ఐరన్ చేసి సర్ప్రైజ్ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి...! ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి పూర్వ ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణకు ఘన నివాళి కృష్ణమ్మను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి ఆ ఎన్నారై వైపే వైసీపీ చూపు... రూరల్ అభివృద్ధే మా లక్ష్యం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కోటంరెడ్డి మౌలిక వసతులు కల్పన కృషి అనంతగిరి ఘాట్‌ బస్సు ప్రమాదంపై స్పీకర్ దిగ్భ్రాంతి నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పింక్ మారథాన్ ర్యాలీ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం వైసీపీకి మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గుడ్‌‌బై: జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు ప్రేమోన్మాదం.. యువతిపై దాడి, ప్రియుడి మృతి ఓట్ల కోసం ఒంగి మొక్కుతారు.. కరువు వస్తే కర్షకుని కంఠం కోస్తారా ‘తొలిముద్ద’ తో చిన్నారులకు పౌష్టికాహారం -అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.

పాకిస్తాన్‌ ఎదుట భారీ లక్ష్యం..

Select Suryaa Now
పాకిస్తాన్‌ ఎదుట భారీ లక్ష్యం..

 ఐచి (జపాన్): ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా సాగుతున్న హైవోల్టేజ్ ఫైనల్ పోరులో భారత్ భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి పాకిస్తాన్‌కు భారత్ 212 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల బారీ స్కోరు నమోదు చేసింది.

భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ సంచలన బ్యాటింగ్‌తో అలరించాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 61 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. అనంతరం మిడిలార్డర్‌లో వచ్చిన తిలక్ వర్మ నిలకడగా ఆడుతూ బాధ్యతాయుత అర్ధశతకంతో (51 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఆఖరి ఓవర్లలో దూకుడుగా ఆడటంతో భారత్ 200 మైలురాయిని సులువుగా దాటేసింది.

ప్రస్తుతం 212 పరుగుల విజయలక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు భారత బౌలర్లు సిద్ధమయ్యారు. ఈ కీలక ఫైనల్లో గెలిచి భారత్‌కు పసిడి పతకం అందించేందుకు టీమిండియా బౌలింగ్ విభాగం పట్టుదలతో ఉంది.