ఓట్ల కోసం ఒంగి మొక్కుతారు.. కరువు వస్తే కర్షకుని కంఠం కోస్తారా
ఓట్లకు వంగి మొక్కుతారు.. కరువు వస్తే కంఠం కోసేస్తారా
వామపక్షాలు ఉరేసుకుని వినూత్న నిరసన
ఎమ్మిగనూరు సూర్యప్రతినిధి
కర్నూలు జిల్లాలో కరువు మండలాలు కనిపించట్లేదా.. తుంగభద్రా నదిలో చుక్కనీరు లేక పంటలు ఎండిపోయాయి.. వర్షాలు కురవక మెట్ట పొలాలు వీడి పొలాలుగా మారాయి అయినా కరువు కనిపించదు.. ఓట్లు అడిగే సమయంలో వంగి వంగి మొక్కే నాయకులు.. కరువు వస్తే కలుసుకుని కంఠం కోసేస్తారా.. అంటూ వాహ పక్ష నాయకులు ఎమ్మిగనూరులో గుంతలకు ఉరితాల్లో బిగించుకొని వెలుతున్నంగా నిరసన వ్యక్తం చేశారు.. కర్నూలు జిల్లాలో 15 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి విడుదల చేసిన జాబితాను చూసిన పశ్చిమ ప్రాంత రైతులు నిస్సహాయతకు గురయ్యారని సిపిఐ నాయకులు రంగన్న, భాస్కర్ యాదవ్ లు పేర్కొన్నారు.. పట్టణంలో గొంతులకు ఉరి తాళ్లు బిగించుకొని వినూత్నంగా నిరసన తెలిపారు.. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే రైతులు బాగుపడతారని అనుకుంటే పంటల బీమాను వసూలు చేయించుకుని కరువును కరువుగా చూడకుండా అన్నదాతలను విస్మరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు వేల రూపాయల అప్పులు తెచ్చి పంటల బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు కనీసం కరువు నిధులు అందించేందుకు చర్యలు చేపట్టకపోగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో విలయతాండవం చేస్తున్న కరువు కళ్లకు కనిపించడం లేదని విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు నిద్రావస్థలో ఉన్నారేమో అని ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కరువు మండలాలుగా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. నియోజకవర్గాన్ని కరువు కరువు ప్రాంతంగా ప్రకటించే వరకు రైతు సంఘాలు వామపక్షాలు వ్యవసాయ కూలీ సంఘాలు ఐక్యతతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.