పూర్వ ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణకు ఘన నివాళి
గన్నవరం, అక్టోబర్ 3, మేెేజర్ న్యూస్ ప్రతినిధి,(గుర్రం ప్రసాద్).
గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి ఎంతో మంది విద్యార్థులకు ఉత్తమ గురువుగా మన్ననలు పొందిన దండమూడి రాధాకృష్ణ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా శనివారం గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ విద్యారంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అవుతు సునీల, విశ్రాంత వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.