భారత వీరుడు, మన జాతి హీరో స్మిత్ మచ్చర్ వేగంగా కోలుకోవాలి
సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధనుంజయ నాయుడు
పెన్ పహాడ్, మేజర్ న్యూస్
ఇటీవల పైలెట్ మచ్చర్ చేసిన అసమాన సాహసాలతో వందలాది మంది ప్రాణాలు కాపాడిన స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకొని క్షేమంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆకాంక్షించారు
శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో విడుదల చేసిన పత్రిక ప్రకటనలో...
శరీరమంతా గాయాల పాలైనా,తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్న తల మరియు చేతులు పూర్తిగా తెగిపోయే పరిస్థితి ఏర్పడ్డా లెక్కచేయకుండా కాక్ పీటర్ వాయిస్ బాక్స్ తెరచి ప్రయాణికుల ప్రాణాలు కాపాడడం ....అసమానన సాహసంతో భారత జాతికి గర్వ కారణంగా నిలిచాడని, ప్రపంచ యువతకు ముఖ్యంగా భారత యువతకు మార్గదర్శిగా నిలిచాడని 174 మంది ప్రాణాలు కాపాడే క్రమంలో ఆయన శరీరం గాయాలతో రక్తం కారుతన్న ప్పటికీ ధైర్య వీడకుండా సాహసోపేతంగా ప్రతిచర్యకు దిగి భారతదేశానికి గర్వకారణoగా నిలిచాడని ప్రతి భారతీయుడు స్మిత్ మచ్చర్ కు శిరస్సు వంచి నమస్కరించాల్సిందేనని భారతీయులంటేనే సాహసానికి మరో పేరని నిరూపించాడని ఆయన కొనియాడారు
విమాన ప్రయాణికులను హైజాక్ చేయాలి అని ప్రయత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని స్మిత్ మచ్చర్ కు అత్యున్నత పురస్కారం అందించి గౌరవించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు