ఎంపీ చెరువులో అభివృద్ధి పరుగులు..
గిద్దలూరు: బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువు గ్రామంలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హెల్త్ సెంటర్‌తో పాటు రూ.15 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు.అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, నాణ్యమైన రహదారులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో బేస్తవారిపేట మండలం ప్రముఖులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు