జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి
గండీడ్ మేజర్ న్యూస్: నిత్యం ప్రజలకు సేవా చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన నేత సేవారత్న అవార్డు గ్రహీత డాక్టర్. వెన్న ఈశ్వరప్ప జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు మహమ్మదాబాద్ మండలం నంచర్ల గేటు పల్లవి ఆడిటోరియంలో జరగనున్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్, రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్,చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు స్వామీజీలు,వ్యాపారవేత్తలు, ముఖ్య నాయకులు పాల్గొంటారని డాక్టర్.వెన్న ఈశ్వరప్ప తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు రావాలని ఆయన కోరారు