గ్రామ గ్రామాన వి బి జి రాంజీ గ్రామసభలు
*ఎంపిక చేయబడ్డ పనులను త్వరగా పూర్తి చేయండి*
*ఎంపీడీవో అనిల్ కుమార్*
ధర్మసాగర్ సెప్టెంబర్ 2 మేజర్ న్యూస్ సూర్య.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఐకమత్యంతో కృషి చేయాలని ఎంపీడీవో అనిల్ కుమార్ కోరారు. ధర్మసాగర్ మండలంలోని ఎలుకుర్తిలో గ్రామ సర్పంచ్ సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన బివిజి రాంజీ పథకం కింద చేపట్టిన గ్రామ సభకు ఎంపీడీవో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ గ్రామ సభల్లో పెద్ద పెండ్యాల లో డీఎల్పిఓ, ధర్మసాగర్ లో ఏ ఈ, ఎం పి ఓ తదితర ప్రభుత్వ అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంగా 375 రకాల పనులను ఆయా గ్రామాల స్థితిగతులు బట్టి ఎంపిక చేసుకోవచ్చని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే భవిష్యత్తులో 125 రోజుల పనిలో దినాలను అధికారులు కల్పించగలుగుతారని అన్నారు. ఎల్ నిననో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిల్వల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇంటికో ఇంకుడు గుంత, పంటకు వ్యవసాయకుంట, గ్రామానికి ఊరకుంట నినాదంతో రాస ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఈ నిధులను ప్రతి కుటుంబం వాడుకోవాలని తద్వారా భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూసుకోవచ్చని ఎంపిడిఓ అన్నారు. ఆయా గ్రామాల్లో బివిజి రామ్చకింద శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన విలేజ్ మ్యాప్ (గ్రామ చిత్రపటం) ప్రజల సౌకర్యార్థం దిక్సూచిలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖ చెందిన అధికారులు, ఎల్కుర్తి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.