BREAKING
వైఎస్సార్సిపిలో కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత 5 న చిల్లర గొల్లపాలెం నందు ఏఎన్‌జీఆర్‌ఏయూ నూతన కేంద్రాల ప్రారంభం పక్షవాతంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ఆర్థిక సాయం కుందూ నది వద్ద టాక్టర్, లారీ బోల్తా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయమే ధ్యేయం బీటెక్ రవి రూ.3.14 కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభం విట్లంపల్లి ప్రజలకు రోడ్డును అంకితం చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తదుపరి తరం జీఎస్టీ: వికసిత్ భారత్ దిశగా మరో మైలురాయి శ్రీమతి నిర్మల సీతారామన్ హ్యూమా ఖురేషి 'బేబీ డూ డై డూ' రివ్యూ: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండవుతున్న ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్ ఎంపీ చెరువులో అభివృద్ధి పరుగులు.. ఎస్ డబ్ల్యూ యూ నూతన యూనియన్ కమిటీ ముంబైకి గుడ్‌బై చెప్పనున్న ప్రముఖ జంట: సొంతూరికి మకాం మార్చనున్న డైరెక్టర్ ఆదిత్య ధర్, యామీ గౌతమ్ వెంకటేష్ చిత్రాల పాటలతో అలరించిన సంగీత సత్సంగం దుక్కి దున్నుతూ ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి. సి.ఎస్.ఐ బేతేలు ఆశ్రమంలో కోడూరి మల్లేశం వర్ధంతి వేడుకలు సోను లేడీస్ ఎంపోరియంలో అనుమతులు లేకుండా ‘Goree Whitening Soap’ విక్రయం

అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

Select Suryaa Now
అనంతగిరి బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని  ఆదేశం

 

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే తగిన మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

అలాగే ప్రమాద స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి నిరంతరం పర్యవేక్షించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.