TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు ప్రచార జాతా
TWU &SWF ఐక్య కూటమి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ డిపో ముందు శనివారం ప్రచార జాతా నిర్వహించారు. ప్రచార జాత ముఖ్య అతిథుల హాజరైన TWU రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగయ్య గౌడ్ , రీజినల్ అధ్యక్షులు వి.ఎస్ నారాయణ , swf రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభాకర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. దశాబ్దం తర్వాత ఆర్టీసీలో జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనయని గత ప్రభుత్వము నిరంకుశంగా ఆర్టీసీలో యూనియన్లను అణిచి వేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెండు పీఆర్సీలు, డి. ఏ లు చెల్లించడం జరిగిందని తెలిపారు. వీటితోపాటు ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలను నిర్వహించు కోవడానికి అనుమతించిందని అందులో భాగంగా అక్టోబర్ 9న జరిగే యూనియన్ ఎన్నికల్లో డిపో ఉద్యోగులు ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన రెండు ఓట్లు బాణం గుర్తుకే వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో డిపో కార్యదర్శి, డిపో చైర్మన్,SWF డిపో అధ్యక్ష, కార్యదర్శులు రీజినల్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్