BREAKING
గుంటూరు నగరంలో వ్యక్తి అదృశ్యం ఆసియా ర్యాంకింగ్స్ లో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఇంటెల్ లో మరోసారి ఉద్యోగాల కోత.. ఎవరిపై ప్రభావం పడుతోంది? ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ అందుతుందా? పూర్తి వివరాలు ఇవే! ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం! ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ 28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు 500 మిలియన్ డాలర్ల మైక్రోసాఫ్ట్ డీల్‌తో ఓపెన్‌ఏఐ నిషేధాన్ని అధిగమిస్తున్న బైట్‌డ్యాన్స్.. అమెరికా ఆంక్షలకు చెక్ పెడుతున్న చైనా టెక్ దిగ్గజం! ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి!

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి

Select Suryaa Now
పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు కావాలి

బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి*

వరంగల్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించి విద్యార్థులకు విజ్ఞప్తి

 

హనుమకొండ, అక్టోబర్ 3, మేజర్ న్యూస్,

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శనివారం వరంగల్ సెంట్రల్ లైబ్రరీని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నమైనదని, ఇందులో ఉన్నత విద్యావంతులు, మేధావులు, సమాజం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారే ఓటు వేస్తారని అన్నారు. కాబట్టి ఇచ్చే తీర్పుకు ఎంతో విలువుంటుందని, నిరంతరం తమ కోసం పోరాడుతున్న వారికే మద్దతుగా నిలవాలని, ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి హడావుడి చేసి మొహం చాటేసే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడేళ్లు కావస్తున్నా 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం వికసించకుండానే వాడిపోయిందని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ప్రైవేట్ రంగంలో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాల హామీ, నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ హామీలన్నీ తుంగలో తొక్కారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రతీ పట్టభద్రుడు, నిరుద్యోగ యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా తమ పక్షాన నిలబడి కొట్లాడుతున్న తనకు, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, జీవో 46 రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం, జీవో 29 రద్దు కోసం పోరాడిన అంశాలను గుర్తు చేశారు.